మంచు విష్ణు 'జిన్నా'కి సీక్వెల్ కూడా ఉంది!
on Oct 19, 2022

ఈమధ్య సీక్వెల్ ల ట్రెండ్ నడుస్తోంది. సినిమా విడుదలకు ముందే పార్ట్-2 ఉంటుందని ప్రకటిస్తున్నారు. తాజాగా మంచు విష్ణు సైతం తాను నటించిన తాజా చిత్రం 'జిన్నా'కి సీక్వెల్ ఉంటుందని తెలిపాడు.
విష్ణు హీరోగా నూతన దర్శకుడు సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జిన్నా'. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్నేళ్లుగా నాకు నచ్చిన సినిమాలు చేశానని, కానీ ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చే సినిమా చేశానని చెప్పాడు. 'జిన్నా' ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపాడు. ఈ సినిమా మంచి ఆదరణ లభిస్తే, 'జిన్నా-2' కూడా చేస్తామని చెప్పుకొచ్చాడు.
'జిన్నా' చిత్రానికి కోన వెంకట్ స్క్రిప్ట్ అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె.నాయుడు వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



