అను ఇమ్మాన్యుయేల్ తో డేటింగ్.. అల్లు శిరీష్ రియాక్షన్!
on Oct 19, 2022

హీరో, హీరోయిన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రావడం సహజం. యువ హీరో అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ప్రేమించుకుంటున్నారని, కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అను ఇమ్మాన్యుయేల్ తో డేటింగ్ వార్తలపై శిరీష్ స్పందించాడు.
శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో శిరీష్, అను బాగా దగ్గరయ్యారని.. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే శిరీష్ మాత్రం తాము మంచి స్నేహితులం మాత్రమేనని అంటున్నాడు.
"నటీనటుల మీద లవ్ గాసిప్స్ రావడం అనేది చాలా కామన్. గతంలోనూ నా గురించి ఇలాంటి గాసిప్స్ వచ్చాయి. మా మధ్య అలాంటిదేం లేదు, మేం మంచి స్నేహితులం మాత్రమే. కొన్ని నెలల పాటు కలిసి పని చేశాం కాబట్టి మా మధ్య అనుబంధం ఏర్పడింది. మా వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి, మా అభిరుచులు కలిశాయి. అందుకే మేం మంచి స్నేహితులయ్యాం" అంటూ అను ఇమ్మాన్యుయేల్ తో తన బంధం గురించి చెప్పుకొచ్చాడు శిరీష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



