కులగజ్జిపై మంచు మనోజ్ మెసేజ్
on Mar 3, 2016
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు కులం అన్న మాటంటే అసలు నచ్చదు. తన విద్యానికేతన్ కు సంబంధించిన ప్రతీ ఫంక్షన్లోనూ కులపిచ్చి ఎంత ప్రమాదకరమైందో ప్రస్తావిస్తుంటారాయన. తన వారసుల్ని కూడా అలాగే పెంచానని చెబుతారు. దానికి తగ్గట్టే, మనోజ్ కూడా కులపిచ్చి వ్యతిరేకంగా మెసేజ్ ఇస్తున్నాడు. మార్చి 4న రిలీజ్ కాబోతున్న శౌర్య మూవీ కోసం ఇంటర్వ్యూ ఇస్తూ, కులాల గురించి స్పందించాడు. కులానికి కాకుండా మానవత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలని, తన సినిమాలకు ఈ కులగజ్జిని అంటించద్దు అంటూ కులాల గురించి ప్రస్తావించాడు. అన్ని కులాల వాళ్లూ, అందరి సినిమాలు చూడాలని పిలుపునిచ్చాడు రాకింగ్ స్టార్. తన సినిమాలతో పోలిస్తే, శౌర్య చాలా కొత్తగా ఉంటుందంటున్నాడు. మనోజ్ సరసన రెజీనా నటిస్తోంది. ఫ్యామిలీ సినిమాల డైరెక్టర్ అని పేరున్న దశరథ్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా శౌర్యను తెరకెక్కించడం విశేషం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
