ఆ హీరోయిన్ విడాకులు కావాలంటోంది..!
on Mar 3, 2016

దేవి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రేమ. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు లేక హీరోయిన్ గా క్లిక్ అవలేకపోయింది. తెలుగుతో పాటు కన్నడ భాషలో కూడా మంచి గుర్తింపు పొందిన ప్రేమ తాజాగా తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. బెంగళూర్ దగ్గర కొడగు ప్రాంతానికి చెందిన జీవన్ అప్పచ్చును 2008 లో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది ప్రేమ. మరి ఏమయిందో ఏమో, తన భర్త నుంచి విడిపోవాలని కోరుకుంటున్నానంటూ బుధవారం బెంగుళూరులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు పెరిగి విడాకులకు దారి తీశాయంటున్నాయి కన్నడ సినీవర్గాలు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో కోర్టును ఆశ్రయించడంతో, త్వరలోనే విడాకులు మంజూరు కానున్నాయని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



