అభిమానులకి కావాల్సింది ఇదే కదా!.. నువ్వింకా ఎదగాలి నాన్న
on Aug 18, 2025

తెలుగు సినిమా పరిశ్రమలో నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, పద్మశ్రీ 'మంచు మోహన్ బాబు'(Manchu Mohanbabu)కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సిల్వర్ స్క్రీన్ పై ఆయన పోషించని క్యారక్టర్ లేదు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చిన ఘనత కూడా ఆయన సొంతం. నట వారసులుగా 'విష్ణు'(Vishnu),మనోజ్'(Manoj)విభిన్న చిత్రాల్లో చేస్తు, తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. భైరవం(Bhairavam)మూవీతో మనోజ్ మే 31 న ప్రేక్షకుల ముందుకు రాగా, కన్నప్ప(Kannappa)తో విష్ణు జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ రెండు చిత్రాల విడుదలకి ముందు మనోజ్, విష్ణు మధ్య జరిగిన కుటుంబ గొడవలు సంచలనం సృష్టించాయి. మోహన్ బాబు కూడా ఎంటర్ అవ్వడంతో గొడవల విషయంలో అభిమానులు ఆందోళన చెందారు. మనోజ్, విష్ణు వరుస ప్రెస్ మీట్ లు నిర్వహించి పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పాటు, పోలీస్ స్టేషన్ లో పోటాపోటీగా కేసులు నమోదు చేయడం. మీడియా సమక్షంగా ఇంటర్వ్యూలు, వివాదాస్పద ట్వీట్ లతో మంచు ఫ్యామిలీలో ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో గొడవ ఇప్పట్లో తగ్గదనే అభిప్రాయాన్ని కలిగించారు. కానీ 'భైరవం' సినిమా రిలీజ్ దగ్గర్నుంచి,విష్ణు, మనోజ్ సైలెంట్ అయ్యారు. ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడటం అనేది చెయ్యలేదు. కన్నప్ప రిలీజ్ కి ముందు టీం కి బెస్ట్ విషెస్ చెప్పడమే కాకుండా, మూవీలో విష్ణు నటనని మనోజ్ మెచ్చుకున్నాడు. దీంతో గొడవలు ఇక లేనట్టే అనే భావన అందరిలో కలిగింది.
ఈ విషయానికి మరింత బలాన్ని చేకూర్చేలా, విష్ణు కొడుకు 'అవ్రామ్'(Avram)కన్నప్ప లో చిన్నప్పటి తిన్నడి క్యారక్టర్ లో అద్భుతంగా నటించినందుకు, రీసెంట్ గా జరిగిన 'సంతోషం ఫిలిం అవార్డ్స్ 2025 '(Santhosham Film Awards 2025)లో బెస్ట్ చైల్డ్ డెబ్యూ కేటగిరి లో అవార్డు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని విష్ణు తన సోషల్ మీడియా అకౌంట్ 'ఎక్స్' లో షేర్ చేసాడు. సదరు వీడియోని మనోజ్ తన 'ఎక్స్' అకౌంట్ లో షేర్ చేసి 'అవ్రామ్, నువ్వు ఇలాగే ఎదగాలి నాన్నా, ఈ అవార్డుని అన్న విష్ణు, నాన్న మోహన్ బాబు తో అందుకోవడం ఎంతో ప్రత్యేకం. 'లాట్స్ ఆఫ్ లవ్' అనే క్యాప్షన్ ని రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్ అభిమానుల్లో ఆనందాన్ని ఇస్తుంది. మంచు ఫ్యామిలీ నుండి రెండో తరం నట వారసుడిగా 'కన్నప్ప 'ద్వారా 'అవ్రామ్' తెరంగ్రేటం చేసాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



