నారీ నారీ నడుమ మురారి ఓటిటి డీల్ ఇదేనా! సంక్రాంతి ఏం జరుగుతుందో మరి
on Jan 5, 2026
.webp)
-ఈ సారి శర్వానంద్ మూవీపై భారీ అంచనాలు
-అందుకు రీజన్ ఏంటి!
-అమెజాన్ ఓటిటి డీల్ వార్తల్లో నిజమెంత
-సంక్రాంతి పందెం కోళ్ళల్లో ఎవరు విజేత
-నారీ నారీ నడుమ మురారి స్పెషల్ ఏంటి
అభిమానుల్లో, ప్రేక్షకుల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న హీరోల్లో శర్వానంద్( sharwanand)కూడా ఒకరు. కొంతకాలంగా వరుస అపజయాలని చవి చూస్తూ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఎవరు ఊహించని రీతిలో అప్ కమింగ్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari)తో సంక్రాంతికి వస్తున్న పందెం కోళ్ళల్లో తను ఒకడిగా నిలిచాడు. సరిగ్గా పండగ రోజైన జనవరి 14 న థియేటర్స్ లో అడుగుపెడుతుండటంతో మూవీపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు ఏర్పడటం, సామజవరగమణ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు కావడంతో ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఏర్పడ్డాయి.
లేటెస్ట్ గా సినీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం నారీ నారీ నడుమ మురారి ఓటిటి హక్కులని అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video)వీడియో సుమారు 17.5 కోట్ల రూపాయలకి పొందినట్టుగా తెలుస్తుంది. సదరు ఓటిటి డీల్ శర్వానంద్ కెరీర్ లోనే హయ్యస్ట్ అని చెప్పుకోవచ్చు.అదే విధంగా అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా సాలిడ్ రేట్ కి బిజినెస్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. వరుస హిట్స్ తో జోరు మీద ఉన్నశ్రీ విష్ణు గెస్ట్ రోల్ లో కనిపిస్తుండటం నారీనారీ నడుమ మురారికి ఉన్న మరో స్పెషాలిటీ. దీంతో శ్రీ విష్ణు రోల్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
Also Read: మెగాస్టార్ కి సర్జరీ నిజమేనా!
ప్రమోషన్స్ త్వరలోనే స్టార్ట్ కానుండగా శర్వానంద్, శ్రీ విష్ణు(Srivishnu)కూడా ఇద్దరు పాల్గొనబోతున్నారు. శర్వానంద్ సరసన సంయుక్త మీనన్(Samyuktha menon),సాక్షి వైద్య(Sakshi Vaidya)జత కట్టగా విశాల్ చంద్రశేఖర్ సంగీత సారధ్యంలో ఇప్పటికే వచ్చిన సాంగ్స్ మెస్మరైజ్ చేస్తన్నాయి. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పై అనిల్ సుంకర(Anil Sunkara)నిర్మాణ సారథ్యంలో తెరకెక్కింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



