మోహన్‌లాల్ సినిమా రిలీజ్ అప్పుడే!
on Jun 17, 2023

మోహన్‌లాల్ - లిజో జోస్ పెళ్లిస్సేరి సినిమా గురించి మేజర్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ ఏడాది ఆఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మోహన్‌లాల్ యాంబిషియస్ ప్రాజెక్ట్ మలైకోట్టై వాలిబన్.
మలైకోట్టై వాలిబన్ అనగానే నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మోహన్‌లాల్, జల్లికట్టు డైరక్టర్ కలిసి చేస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ అనే మాట జనాల్లో ఆల్రెడీ నానింది. ఫాంటసీ టచ్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కాస్ట్ అండ్ క్రూ కలిసి ఈ సినిమా కంప్లీట్ అయిన సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు.
ఈ సినిమాతోనే పొలిటీషియన్ షిబు బేబీ జాన్ నిర్మాతగా సినీ ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళం సినిమా చరిత్రలో ఇప్పటిదాకా ప్రేక్షకులు చూడని ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయని అన్నారు షిబుబేబీ జాన్.
ఈ క్రిస్‌మస్‌కి మోహన్ లాల్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఉంటుందనే వార్త అప్పుడే స్ప్రెడ్ అయింది.
మలైకోట్టై వాలిబన్ చిత్రీకరణ జరిగిన తీరుకు తను చాలా ఆనందంగా ఉన్నట్టు వెల్లడించారు లాల్ ఏట్టన్. తన కెరీర్ మొత్తం మీద ఇది డిఫరెంట్ సినిమా అని చెప్పారు. ఇలాంటి యూనిక్ రోల్ కోసం తనను అప్రోచ్ అయినందుకు లిజోకి థాంక్స్ కూడా చెప్పారు.
చాలా కాలం తర్వాత ఈ సినిమాలో మోహన్‌లాల్ డ్యూయల్ యాక్షన్ చేశారు. ఫాంటసీ పీరియడ్ యాక్షన్ సినిమా ఇది. ప్రీ ఇండిపెండెన్స్ సమయంలో తెరకెక్కించారు. పొడవాటి జుట్టు, రఫ్ గడ్డం ఉన్న మోహన్‌లాల్ పోస్టర్ అప్పట్లో ఇంటర్నెట్‌ని షేక్ చేసింది. మోహన్‌లాల్ సెకండ్ లుక్‌ని ఇంకా రివీల్ చేయలేదు. మలయాళం, తమిళ్, తెలుగు , మరాఠీ, బెంగాలీలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



