నేను రెడీ అంటున్న విజయ్!
on Jun 17, 2023

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా లియో. ఈ సినిమా నుంచి నా రెడీ అనే పాటను విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లియో మూవీ నుంచి విడుదలవుతున్న ఫస్ట్ సింగిల్ ఇది.
దళపతి విజయ్ పుట్టినరోజు ఈ నెల 22. ఆ రోజు కోసం దళపతి ఫ్యాన్స్ చాలా ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ బ్లడీ స్వీట్ అంటూ గ్లింప్స్ రిలీజ్ చేసిన లోకేష్ కనగరాజ్, ఇప్పుడు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ నా రెడీ (నేను రెడీ)ని రిలీజ్ చేయబోతున్నారు. టోటల్ పార్టీ వైబ్‌లో ఉండబోతోంది ఈ పాట.

ఆల్టర్ ఈగో అంటూ అసలు విషయాన్ని చెప్పేశారు లోకేష్ అంటూ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మీద విజయ్ సిగరెట్‌తో కనిపిస్తున్నారు. ఇంకో చేతిలో ఫైరింగ్ గన్ ఉంది. బ్యాక్ గ్రౌండ్ మొత్తం పార్టీ వైబ్స్ కనిపిస్తున్నాయి. టోటల్‌గా సూపర్ డూపర్ హెయిర్ స్టైల్, గడ్డం, బ్లాక్ ఔట్‌ఫిట్‌తో గ్యాంగ్‌స్టర్‌లా కనిపిస్తున్నారు విజయ్.
విజయ్ అన్నా బర్త్ డే కోసం వెయిట్ చేయమంటూ హింట్స్ ఇచ్చేశారు డైరక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్‌హాసన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ రిలీజ్ చేస్తారని వార్తలొచ్చాయి. అయితే, టీజర్ సంగతిని మాత్రం మేకర్స్ ఇంకా అఫిషియల్‌గా ప్రస్తావించలేదు. బర్త్ డే నెక్స్ట్ డే వైబ్స్ కంటిన్యూ చేయడానికి, ట్విట్టర్‌లో కంటిన్యూయస్‌గా ట్రెండ్‌లో ఉండటానికి టీజర్ రిలీజ్ చేస్తారనే మాటలున్నాయి.
మాస్టర్ తర్వాత విజయ్ - లోకేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్‌లో ఉండే యాక్షన్ - క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. 14 ఏళ్ల తర్వాత విజయ్ తో జోడీ కడుతున్నారు త్రిష. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



