'జైలర్' కోసం రజనీకి ఆలిమ్ హకీమ్ స్టైలింగ్!
on Jul 25, 2022

రజనీకాంత్ నటించనున్న తదుపరి చిత్రం 'జైలర్'. 'డాక్టర్', 'బీస్ట్' ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దీనికి దర్శకుడు. ఇటీవల చెన్నైలో టెస్ట్ షూట్‌ను నిర్వహించింది చిత్ర బృందం. త్వరలో హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే, పాపులర్ మేకప్ ఆర్టిస్ట్ ఆలిమ్ హకీమ్ సూపర్‌స్టార్‌కు స్టైలింగ్ చేయనున్నాడు. ఆయనతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన హకీమ్, "An innovative day at work with our one & only King Sir RAJNIKANTH," అని రాసుకొచ్చాడు.
ఆ ఫొటో ప్రకారం రజనీకాంత్ తన గడ్డం లుక్‌ను ఈ సినిమాలోనూ కొనసాగించనున్నారని అర్థమవుతోంది. అయితే ఆయన హెయిర్ లుక్ మారే అవకాశం ఉందని సమాచారం. కామెడీ మేళవించిన యాక్షన్ డ్రామాగా రూపొందే 'జైలర్'లో రజనీ జోడీగా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ నటించనుంది. శివ రాజ్‌కుమార్, ప్రియాంక అరుళ్‌మోహన్, రమ్యకృష్ణ కీలక పాత్రధారులు.
ఆగస్ట్ 3న లాంఛనంగా చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆ తర్వాత ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరిపేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ 2023 ఏప్రిల్‌లో విడుదల కానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



