కర్నూల్ లో బాలయ్య గర్జన.. లుక్ మామూలుగా లేదు!
on Jul 25, 2022
.webp)
సీడెడ్(రాయలసీమ)లో నటసింహం నందమూరి బాలకృష్ణకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన 'NBK 107' షూటింగ్ కోసం కర్నూల్ వెళ్లగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్ తదితర ప్రాంతాలలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ లొకేషన్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ ధరించి పవర్ ఫుల్ లుక్ లో ఉన్న బాలయ్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో బోయపాటి శ్రీను మినహా బాలయ్యను ఆ రేంజ్ లో ఎవరూ చూపించలేదు. దీంతో బోయపాటితో పోలుస్తూ మలినేనిని ప్రశంసిస్తున్నారు బాలయ్య అభిమానులు. అలాగే కర్నూల్ షెడ్యూల్ లో శృతి హాసన్ కూడా పాల్గొంది. బాలయ్యతో ఆమె తీసుకున్న సెల్ఫీలు ఆకట్టుకున్నాయి. వాటిల్లో బాలయ్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

ఇక బాలయ్యను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. కొందరితో ప్రత్యేకంగా ముచ్చటించిన బాలయ్య.. అభిమానులతో కలిసి భోజనం చేసినట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



