మహేష్ vs బన్నీ... బాక్సాఫీస్ పోరులో ఎవరిది పైచేయి?
on Jan 9, 2020
.jpg)
'సంక్రాంతికి విడుదలవుతున్నవి సినిమాలు... పందెం కోళ్ళు కాదు కదా! పోటీ పడడానికి' అని త్రివిక్రమ్ అన్నారు. అయినా... అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంక్రాంతికి బాక్సాఫీస్ పోరులో ఎవరిది పైచేయి అవుతుందని ఆసక్తిగా చూస్తున్నారు. ఈనెల 11న మహేష్ 'సరిలేరు నీకెవ్వరు', 12న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంములో' సినిమాలు విడుదల అవుతున్నాయి. రెండు విజయాలు సాధించాలని అందరూ కోరుకుంటున్నారు. రెండు విజయాలు సాధిస్తాయా? లేదా ఏదో ఒకటి మాత్రమే విజయం సాధిస్తుందా? అనే సంగతి పక్కన పెడితే... ఇప్పటివరకు మహేష్ బాబు, అల్లు అర్జున్ ఎన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర ముఖాముఖి తలపడ్డారు? అనేది చూస్తే ఒక్కసారి కూడా తల పడలేదు. వీళ్లిద్దరి సినిమాలు ఒకే వారంలో ఇప్పటి వరకు విడుదల కాలేదు.
జనవరి 10, 2014లో మహేష్ '1 నేనొక్కడినే' విడుదలైంది. అదే నెలలో 12న రామ్ చరణ్ 'ఎవడు' విడుదలైంది. అందులో అల్లు అర్జున్ అతిథి పాత్ర పోషించారు. అప్పట్లో వసూళ్ళ పరంగా 'ఎవడు' పైచేయి సాధించింది. '1 నేనొక్కడినే' విమర్శకుల మెప్పు పొందిన చిత్రంగా మిగిలింది. అంతకుముందు 2014లో మే నెలలో 7న 'ఆర్య', 14న 'నిజం' విడుదలయ్యాయి. అనూహ్య విజయం సాధించిన ఆర్య... ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ కు ఒక ఇమేజ్ తీసుకొచ్చింది. నిజం అంచనాలను చేరుకోలేక పోయింది. సంక్రాంతి సీజన్ లో 80% సక్సెస్ రేట్ ఉన్న మహేష్ బాబు... అప్పుడెప్పుడో 2007లో జనవరి 12న 'దేశముదురు'తో సంక్రాంతి సీజన్ లో సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్... ఈ సంక్రాంతికి తొలిసారి బాక్సాఫీస్ బరిలో ముఖాముఖి తలపడుతున్నారు. వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



