సంక్రాంతికి మహేష్ ట్రాక్ రికార్డు ఎలా ఉంది?
on Jan 9, 2020

సెంటిమెంట్... సెంటిమెంట్... సెంటిమెంట్... సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వేటలో సెంటిమెంట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది విడుదల తేదీలో కావొచ్చు... కాంబినేషన్ లో కావొచ్చు... మరో అంశంలో కావొచ్చు. సెంటిమెంట్ చూసుకొని మరీ పనిచేసే ప్రముఖులు ఎక్కువ మంది ఉన్నారు. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్స్ క్లాష్ అవుతాయేమోనని కాస్త ఆందోళనకర వాతావరణం ఏర్పడినప్పుడు... '1 నేనొక్కడినే' బాడ్ సెంటిమెంట్ కారణంగా జనవరి 10న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో థియేటర్లలోకి రావడానికి మహేష్ బాబు సుముఖంగా లేడని చాలామంది భావించేవారు. కొంతమంది వార్తలు కూడా రాశారు. అసలు సంక్రాంతికి మహేష్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? సంక్రాంతికి మహేష్ నటించిన సినిమాల్లో ఏవి విడుదలయ్యాయి? వాటి పరిస్థితి ఏంటి? హిట్టా? ఫట్టా? ఓ లుక్కేయండి.
> సంక్రాంతికి విడుదలైన మహేష్ తొలి సినిమా 'టక్కరి దొంగ'. జనవరి 11, 2002 లో విడుదలైంది. ఈ కౌబాయ్ ఫిల్మ్ భారీ సక్సెస్ సాధిస్తుందని చాలామంది అంచనా వేశారు. మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ జోనర్ ఫిలింస్ చాలా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
> 'టక్కరి దొంగ' విడుదలైన మరుసటి ఏడాది 'ఒక్కడు' విడుదలైంది. జనవరి 15, 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. మహేష్ సూపర్ స్టార్ గా అవతరించడంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. మహేష్ కెరీర్లో ఫస్ట్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇదేనని చెప్పవచ్చు.
> 2003 తర్వాత మళ్ళి సంక్రాంతికి మహేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది 2012లోనే. ఆ ఏడాది జనవరి 13న 'బిజినెస్ మేన్' విడుదలైంది. 'పోకిరి' తర్వాత మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. దాంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'పోకిరి' స్థాయిలో కాకపోయినా ఈ సినిమా మంచి విజయం సాధించింది.
> మహేష్ నటించిన తొలి మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదలైంది కూడా సంక్రాంతికే. జనవరి 11, 2013లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ ప్రేక్షకులకు మహేష్ ను మరింత దగ్గర చేసింది. మధురమైన విజయాన్ని అందించింది.
> జనవరి 10, 2014లో '1 నేనొక్కడినే' విడుదలయింది. చాలా మంది విమర్శకులను ఈ సినిమా మెప్పించింది. ఇప్పుడంతా ఈ సినిమాను క్లాసిక్ జాబితాలో వేస్తున్నారు. చిత్ర దర్శకుడు సుకుమార్ ఇప్పటికీ ఈ సినిమా గురించి చెబుతుంటారు. అయితే... బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం దక్కలేదు. కానీ గొప్ప పేరును తీసుకువచ్చింది. ఈ సినిమాలో విజయాల జాబితాలో నిస్సందేహంగా వేయవచ్చు.
నిజంగా సెంటిమెంట్ కు మహేష్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే... ఈ నెల 11న 'సరిలేరు నీకెవ్వరు' విడుదల చేయడు. ఎందుకంటే... 'టక్కరి దొంగ' విడుదలయింది జనవరి 11న కాబట్టి. సంక్రాంతికి మహేష్ సినిమాలు మొత్తం ఐదు విడుదల అయితే అందులో నాలుగు విజయాలు సాధించాయి. సో... సంక్రాంతికి మహేష్ ట్రాక్ రికార్డ్ బావుంది. సంక్రాంతికి మహేష్ సక్సెస్ రేట్ 80%. 'సరిలేరు నీకెవ్వరు'తో ఈ రేషియో మరింత పెరుగుతుందని మహేష్ అభిమానులు ఆశిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



