మహేష్ ఇమేజ్‌కు డ్యామేజ్...
on Dec 27, 2019

ఎట్టకేలకు తమ అభిమాన హీరోతో అభిమానులు ఫొటోలు దిగారు. వాళ్లు దిగారని చెప్పడం కంటే... మొత్తానికి అభిమానులకు తనతో ఫొటోలు దిగే అవకాశాన్ని మహేష్ బాబు కల్పించారని చెప్పడం సబబుగా ఉంటుంది. ఆయన గొప్ప మనసుకు ఈ వ్యవహారం అంతా ఓ నిదర్శనం.
హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో బుధవారం ఏర్పాటు చేసిన 'అభిమానులతో మహేష్ బాబు ఫొటోషూట్' ప్రోగ్రామ్ రచ్చ రచ్చ కావడంతో మధ్యలో మహేష్ అక్కడ నుండి వెళ్లిపోయారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో అభిమానుల్లో ఇద్దరి కాళ్లు విరిగినట్టు తెలుస్తోంది. ప్రోగ్రామ్ ఏర్పాట్లు సరిగా చేయలేదని మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి గమనించిన మహేష్, నమ్రత... గురువారం తమ మనుషులతో ఏర్పాట్లు చేయించారు. షెడ్యూల్ లో లేకపోయినా... మహేష్ మళ్ళీ అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చి అభిమానులకు ఫొటోలు ఇచ్చారు. ఫొటోలు దిగినవాళ్లు హ్యాపీ. కానీ, కొందరు దిగలేకపోయారు. తొలుత ప్రోగ్రామ్ ఏర్పాట్లు చేసినవారి తప్పిదాలతో వాళ్లు ఫొటోలు దికలేకపోయినట్టు తెలుస్తోంది. ఫొటోలు దిగలేని వారు సంతోషంగా లేరు.
అభిమాన హీరోతో ఫొటోలు దిగాలని సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్ వచ్చేవారి కోరిక ప్రతిసారి నెరవేరదు. కొందరికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్ లు కూడా దొరకవు. స్టేడియం బయట పడిగాపులు కాస్తుంటారు. ఇవన్నీ సహజమే. ఇటువంటి జరిగినప్పుడు హీరోలను నిందించలేం. కానీ, అభిమానులతో మహేష్ ఫొటోషూట్ ప్రోగ్రామ్ వల్ల మహేష్ ఇమేజ్‌కు డ్యామేజ్ జరిగిందనేది వాస్తవం. అలాగే, ఈ ప్రోగ్రామ్ ఏర్పాట్లు చూసిన 'సరిలేరు నీకెవ్వరు' ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన ఏకే ఎంటర్టైన్మెంట్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది.
తమను బౌన్సర్లతో కొట్టించడం ఏంటని బుధవారం తన్నులు తిన్న మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికో డబ్బులు ఇచ్చి ఫొటోలు దిగడానికి వచ్చి కొందరు మోసపోయారు. వాళ్ల కోపం మరోలా ఉంది. స్టార్ హీరోతో ఫొటో సెషన్ అంటే ఎంతమంది అభిమానులు వస్తారో అంచనా వేయలేకపోయారా? అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాకు ఎక్కడంతో రచ్చ రచ్చ అవుతోంది. తమ హీరోతో ఫోటో సెషన్ చాలా ప్లాన్ ప్రకారం జరిగిందని చెబుతూ ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తుండడం మహేష్ అభిమానులను రెచ్చగొట్టడానికి అన్నట్టు ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



