గాసిప్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టనున్న బాలయ్య-బోయపాటి
on Dec 27, 2019

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయనున్న సినిమా ఇబ్బందుల్లో పడిందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో గాసిప్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఓవర్ బడ్జెట్ కారణంగా నిర్మాత చేతులెత్తేశారని ఒకసారీ, నిర్మాత మారే అవకాశం ఉన్నదని ఇంకోసారీ, 'రూలర్' మూవీ బాక్సాఫీస్ ఫలితంతో అసలు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం డౌటంటూ ఇంకోసారీ.. ఇట్లా రకరకాల వదంతులు ఈ సినిమా చుట్టూ అల్లుకున్నాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవన్నీ కేవలం వదంతులేననీ, ఇదివరకు అనుకున్న విధంగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందనీ తెలిసింది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం సంక్రాంతి సెలవులు అయిపోగానే రెగ్యులర్ షూట్ మొదలుపెట్టేందుకు బాలకృష్ణ, బోయపాటి సిద్ధమవుతున్నారు. అలాగే నిర్మాత మారనున్నారనేది కేవలం గాసిప్పేననీ, ఈ మూవీని అఫిషియల్‌గా లాంచ్ చేసిన మిర్యాల రవీందర్‌రెడ్డే దీన్ని నిర్మిస్తారనీ ఆ వర్గాలు స్పష్టం చేశాయి.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు రెండూ సూపర్ హిట్ కావడంతో తాజా సినిమాపై కూడా భారీ అంచనాలే వ్యక్తమవుతున్నాయి. బాలయ్యను స్క్రీన్‌పై ఎలా ప్రెజెంట్ చెయ్యాలనే విషయం బోయపాటికి బాగా తెలుసనీ, అందువల్ల ఈ సినిమాపై బాలయ్య అభిమానుల్లో కానీ, బిజినెస్ వర్గాల్లో కానీ ఎలాంటి అనుమానాలు లేవనీ ఫిలింనగర్ జనాలు అంటున్నారు. కేవలం కొంతమంది పనిగట్టుకొని ఈ సినిమాపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేశారని వారు చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను నిర్మాత అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. బాలయ్య సరసన ఓ నాయికగా క్యాతరిన్ ట్రెసా ఎంపికవగా, మరో నాయిక ఎంపిక జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



