వర్మ దృష్టిలో మహేశ్ దేవుడు..ఎలాగంటే
on Apr 13, 2017
నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తాడు వర్మ..విషయం ఏదైనా..అవతలి వ్యక్తి ఎవరైనా సరే వర్మ కామెంట్ల నుంచి తప్పించుకోలేరు..ఈ మధ్య టాలీవుడ్‌పై ఫోకస్ తగ్గించి బాలీవుడ్‌పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. తాజాగా టైగర్ ష్రాఫ్, విద్యుత్ జమాల్ల మధ్య పెద్ద వైరానికి కారణం అయ్యాడు. ఇది కాస్త పెద్దది కావడంతో మొట్టమొదటి సారిగా సారీ చెప్పి వివాదానికి తెర దించే ప్రయత్నం చేశాడు. అది ముగిసిందో లేదో వెంటనే బ్యాక్ టూ టాలీవుడ్ అన్నాడు. వచ్చి రాగానే మహేశ్ స్పైడర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడంతో ట్వీట్ అందుకున్నాడు. ఫస్ట్ లుక్ అద్భుతమని, మహేశ్ బాబు అక్షరాల దేవుడిలా ఉన్నాడంటూ సెటైరికల్‌గా స్పైడర్ పోస్టర్ని పెట్టి ట్వీట్ చేశాడు. అంతే, మహేశ్ ఫ్యాన్స్ వర్మను ఒక ఆట ఆడుకోవడం మొదలెట్టేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
