మదరాసి మూవీ రివ్యూ
on Sep 5, 2025
.webp)
సినిమా పేరు: మదరాసి
తారాగణం: శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, బిజూ మీనన్, విద్యుత్ జమ్మూవాల్, షబీర్ తదితరులు
మ్యూజిక్: అనిరుద్ రవిచందర్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
రచన, దర్శకత్వం: మురుగదాస్
సినిమాటోగ్రాఫర్: సుదీప్ ఎలీమాన్
బ్యానర్: శ్రీ లక్షి మూవీస్
నిర్మాత: లక్ష్మి ప్రసాద్
విడుదల తేదీ: సెప్టెంబర్ 5 ,2025
అమరన్ హిట్ తర్వాత శివ కార్తికేయన్(Siva Karthikeyan)సికందర్ లాంటి భారీ ప్లాప్ తర్వాత మురుగదాస్(Ar Muragadoss)ఈ రోజు మదరాసి(madharaasi)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
రఘు( శివ కార్తికేయన్) పద్నాలుగేళ్ల వయసు నుంచే మానసిక రుగ్మత తో ప్రవర్తించే పేషంట్. అందుకు తగ్గ మెడిసిన్స్ కూడా వాడుతుంటాడు. మాలతి(రుక్మిణి వసంత్) డెంటల్ డాక్టర్ తో పాటు మ్యుజిషియన్. తొలి చూపులోనే మాలతిని రఘు ప్రేమిస్తాడు. మాలతీకి రఘు హెల్త్ ప్రాబ్లమ్ తెలుసు. అయినా సరే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ ఒక కారణం వల్ల రఘుని వదిలి వెళ్లిపోతుంది. దీంతో రఘు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. నార్త్ ఇండియాకి చెందిన విరాట్, చిరాగ్ అనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు తమిళనాడుని నాశనం చేయాలనీ చూస్తుంటారు. ఈ ఇద్దరి వెనక రాజకీయశక్తులతో కూడిన పెద్ద సిండికేట్ ఉంటుంది. వాళ్ళ ప్రయత్నాన్ని ఆపడానికి NIA స్పెషల్ ఆఫీసర్ ప్రేమ్(బిజూ మీనన్) తన టీంతో ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో విరాట్, చిరాగ్ లతో రఘు పోరాడాల్సి వస్తుంది. టెర్రరిస్టులతో రఘు ఎందుకు పోరాడవలసి వచ్చింది? రఘు మెంటల్ కండిషన్ ఏంటి? ఆ ప్రాబ్లమ్ వల్ల ఎలా ప్రవర్తిస్తాడు. మాలతీ, రఘుని ప్రేమించడానికి ఏమైనా కారణం ఉందా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఎందుకు వెళ్లిపోయింది? మళ్ళీ ఇద్దరు కలిసారా? తమిళనాడుని ఏ రూపంలో టెర్రరిస్టులు నాశనం చెయ్యాలని చూసారు? తనకున్న ప్రాబ్లెమ్ తో రఘు ఎలా పోరాడాడు? తమిళనాడుని రక్షించాడా? లేదా అనేదే మదరాసి కథ
ఎనాలసిస్
సంఘవిద్రోహ శక్తులు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో అలజడులు సృష్టించడానికి ప్రయత్నించడం, హీరో వాటిని ఎదుర్కోవడం లాంటి సింగల్ పాయింట్ పై నడిచే కథలు సెల్యులాయిడ్ పై చాలానే వచ్చాయి. కాకపోతే రఘు హెల్త్ ప్రాబ్లమ్, మాలతి, రఘు లవ్ బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంది. ముందుగానే ఊహించేలా కొన్ని సీన్స్ వచ్చాయి. కానీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఆ ఫీలింగ్ ని మర్చిపోయేలా చేసాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లోనే రఘు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ మంచి ఎంటర్ టైన్ మెంట్ గా ఉన్నాయి. NIA ఆఫీసర్స్ సీన్స్ తో పాటు టెర్రరిస్టుల సీన్స్ రొటీన్. కాకపోతే వీటిని తెరకెక్కించిన విధానం బాగుంది. రఘు,మాలతీ మధ్య లవ్ సీన్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. రఘు మానసిక రుగ్మతకి గురవ్వడానిక్ కారణం, ఆ ప్రాబ్లమ్ తన శరీరంలోకి వచ్చాక రఘు ప్రవర్తించే సీన్స్ ఎక్స్ లెంట్ . ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్. సెకండ్ హాఫ్ చాలా వేగంగా కదిలింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు, చివరకి ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలిగింది. ఊహించని విధంగా క్యారెక్టర్స్ కళ్ల ముందు కదిలాయి. క్లైమాక్స్ ఊహించిందే అయినా, మాలతీ విషయంలో చిన్న టెన్షన్ పెట్టకుండా, మాలతీ టెర్రరిస్టుల చేతిలో చనిపోవడానికి సిద్దపడాల్సింది. ఎందుకంటే ఈ కథ మొత్తం రఘు వల్ల సమాజానికి మంచి జరగాలనే మాలతీ రఘు కి దూరంగా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు తమిళనాడుని నాశనం చెయ్యాలని అనుకున్న టెర్రరిస్టుల వల్ల మాలతీ చనిపోతే రఘు వాళ్ళందర్నీ చంపుతాడు కదా. ఈ విధంగా మాలతీ అనుకోని రఘు కి చెప్పాల్సింది. కానీ మాలతిని రఘు తన పోరాటాలతో కాపాడి ఉంటే, కథకి అన్ని వైపులా నుంచి డెస్టిఫై వచ్చేది. సినిమా విజయం తాలూకు రూపం కూడా మారిపోయేది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
రఘు క్యారక్టర్ లో శివ కార్తికేయన్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన పెర్ ఫార్మెన్స్ తో సినిమాకి ప్లస్ అవ్వడంతో పాటు, నటనకి సంబంధించి తన కెరీర్ లోనే 'మదరాసి' బెస్ట్ మూవీగా చెప్పుకునేటట్టుగా చేసాడు. లవ్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్ని వేరియేషన్స్ ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించాడు.మాలతీ క్యారక్టర్ లో రుక్మిణి వసంత్ మరో సారి తన అందమైన నటనతో మెప్పించింది. తను ప్రేమించిన వ్యక్తి బాగుండాలని, అతని సంతోషం కోసం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసే యువతిగా సూపర్ గా చేసింది. N I A ఆఫీసర్ ప్రేమ్ క్యారక్టర్ లో చేసిన బిజూమీనన్, టెర్రరిస్టులుగా చేసిన విద్యుత్ జమ్మూ వాల్, షబీర్ లు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక అనిరుద్ మ్యూజిక్ లో వచ్చిన సాంగ్స్ , చాలా రోజుల తర్వాత తెలుగు లిరిక్స్ లో వినడానికి బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎంతో ప్లస్ అయ్యింది. మురుగదాస్ మరో సారి గజని టైంలోని మురుగదాస్ ని చూపించాడు. అంతలా టేకింగ్ తో మెస్మరైజ్ చేసాడు. కాకపోతే కథని విసృతమైన పరిధిలో చూపించలేదు. ఆ అవకాశం ఉండి కూడా ఆ దిశగా ప్రయతించలేదు. నార్త్ ఇండియా గన్ కల్చర్ ని సౌత్ ఇండియాకి తీసుకురావాలని చూస్తున్నారు కాబట్టి నార్త్ ఇండియాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలని ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. సినిమా ప్రారంభమే ఈ పాయింట్ పై తీసుకొని ఉంటే మదరాసి ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండేది.
ఫైనల్ గా చెప్పాలంటే కథ రొటీన్ అయినా,పకడ్బందీ స్క్రీన్ ప్లే, దర్శకత్వం, శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్ లవ్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఎక్కువ అంచనాలు లేకుండా మదరాసికి వెళ్ళాలి.
,
రేటింగ్ 2 .5 /5 అరుణాచలం
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



