మా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. వారు పోటీకి అర్హులు కారు!
on Sep 17, 2021

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు జూబ్లీ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఓ ప్రకటనలో తెలిపారు.
మా ఎన్నికలకు ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని కృష్ణమోహన్ చెప్పారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని.. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని వెల్లడించారు. 2వ తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 10న సాయంత్రం 7 గంటలకు వెల్లడిస్తామన్నారు.
'మా' ఎన్నికల నియమ నిబంధనలు:
1. ఒక అభ్యర్థి ఒక పోస్ట్ కోసం మాత్రమే పోటీ చేయాలి.
2. గత ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అయి ఉండి.. ఈసీ సమావేశాలకు 50 శాతం కన్నా తక్కువ హాజరైతే పోటీ చేయడానికి అర్హత ఉండదు.
3. 20 శాఖల అసోసియేషన్లలో ఆఫీస్ బేరర్స్ గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే వారు పోటీ చేసేందుకు అర్హులు కారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



