'భీమ్లా నాయక్' నుండి 'డానియల్ శేఖర్' అప్డేట్ వచ్చేసింది
on Sep 17, 2021

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ మూవీలో భీమ్లా నాయక్ పాత్రలో పవన్, డానియెల్ శేఖర్ పాత్రలో రానా నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుండి భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా డానియెల్ శేఖర్ గ్లింప్స్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్.
'భీమ్లా నాయక్' అని పవన్ పోషిస్తున్న పాత్ర పేరే మూవీ టైటిల్ గా పెట్టారు. అలాగే ఇప్పటికే భీమ్లా నాయక్ లుక్, గ్లింప్స్, టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. కానీ రానా పోషిస్తున్న డానియెల్ శేఖర్ పాత్రకు సంబంధించి ఇంతవరకు ఏ అప్డేట్ ఇవ్వకపోవడంతో రానా నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో డానియెల్ శేఖర్ పాత్ర అప్డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. 'బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్' పేరుతో ఈనెల 20న ఓ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 న విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



