హాట్ సమ్మర్‌లో అందరూ మెచ్చిన ప్రేమకథ సీక్వెల్ రిలీజ్!
on Sep 25, 2023
ప్రేమకథా చిత్రాలు ఎన్ని సంవత్సరాలు గడిచినా సజీవంగానే ఉంటాయి. ఈ సినిమాలకు యూత్ ఆడియన్స్ ఎప్పుడైనా కనెక్ట్ అవుతారని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. దాదాపు 19 సంవత్సరాల క్రితం విడుదలైన ప్రేమకథా చిత్రం ‘7జి. బృందావన కాలని’. అప్పట్లో ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా ఘనవిజయం సాధించింది. యువన్ శంకర్‌రాజా సంగీతం ఈ సినిమాకి ఓ హైలైట్‌గా చెప్పొచ్చు. హీరో రవికృష్ణ నటన, దర్శకుడు శ్రీరాఘవ టేకింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాకి వున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఇటీవల ప్రూవ్ అయింది. కొన్ని క్లాసిక్ మూవీస్‌ని రీరిలీజ్ చేస్తున్న ప్రస్తుత తరుణంలో ‘7జి. బృందావన కాలని’ కూడా ఈమధ్య విడుదలైంది. ఈ రీరిలీజ్‌కి మామూలు రెస్పాన్స్ రాలేదు. యూత్ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు.
ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇటీవల హీరో రవికృష్ణతో జరిగిన ఇంటర్వ్యూలో ‘7జి. బృందావన కాలని’ సినిమా ప్రస్తావన వచ్చినపుడు, దానికి సీక్వెల్ రాబోతోందని ఆయన వెల్లడిరచారు. ఇంతకుముందే సీక్వెల్ అనుకున్నామని, అయితే నాన్నగారు, డైరెక్టర్ శ్రీరాఘవ చాలా బిజీగా ఉండడం వల్ల దాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టాము. ఇక వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. 2024 ఏప్రిల్‌లోగానీ, మేలోగానీ ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని హీరో రవికృష్ణ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



