చంద్రబాబుకి బ్యాడ్ టైం నడుస్తుంది.. సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
on Sep 25, 2023

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. ప్రస్తుతం బాబుకి బ్యాడ్ టైం నడుస్తుందని, ఒక్కసారి ఆయన స్టార్ట్ అయితే సింపుల్ గా బయటకు వస్తారని అన్నారు.
ఈ కోర్టులు, కేసులు, జైలు చూసినవాడిగా అనుభవంతో చెబుతున్నానని, దేనికైనా టైం రావాలని సుమన్ చెప్పారు. నా కేసు విషయంలో.. ఎఫ్ఐఆర్ వేరు, న్యూస్ వేరు, ఛార్జ్ షీట్ వేరు అని గుర్తు చేసుకున్నారు. అప్పుడు బెయిల్ కోసం సుప్రీమ్ కోర్టు దాకా కూడా వెళ్లానని తెలిపారు. తాను టైంని, విధిని బాగా నమ్ముతానని.. టైం బాగుంటే సుప్రీమ్ కోర్టు వరకు కూడా వెళ్ళకుండానే, సింపుల్ గా లోకల్ కోర్టులోనే బెయిల్ వస్తుందని అన్నారు. చంద్రబాబు గారి విషయంలో అదే జరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం ఆయన టైం బాలేదని, టైం వచ్చినప్పుడు అసలు వీటితో పనేం లేకుండా ఆయన అనుకోకుండా బయటకు వస్తారని చెప్పారు. కొన్ని మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయి. మా స్టాఫ్ తప్పు చేసినా, మాపైనే వస్తుంది. అలాగే బాబు గారికి తెలీకుండా ఏమైనా జరిగిందేమో. నిజానిజాలు తెలియడానికి కాస్త సమయం పడుతుంది. చంద్రబాబు గారిని హైదరాబాద్ అభివృద్ధితో పాటు పలు విషయాల్లో అభినందించాలి. ఈ బ్యాడ్ టైం పోయి, ఆయన త్వరగా బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సుమన్ పేర్కొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



