సాహో కంటే లైగర్ కే వీక్షకులు ఎక్కువ సుమా!
on Dec 23, 2022

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ చిత్రం డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ ప్రోత్సాహంతో పాన్ ఇండియా మూవీగా పూరీ తెరకెక్కించారు. ఈ చిత్రం పూరి- విజయల మూడేళ్ల శ్రమను వృధా చేసింది. విడుదలకు ముందు పాన్ ఇండియా లెవెల్లో జెండా ఎగురవేస్తానని చెప్పుకొని తిరిగిన విజయ్ దేవరకొండ రిలీజ్ తర్వాత మీడియా కి మొహం చూపించడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఈడీ చేత కూడా విచారణ చేయించుకునే స్థితికి వచ్చాడు. విజయ్ దేవరకొండ పూరి మీద నమ్మకంతో లైగర్ విడుదలకు ముందే జనగణమన అనే సినిమా కమిట్ అయ్యాడు. కానీ లైగర్ ఫలితం చూసి ఈ మూవీకి జనగణమన పాడాడు.
గతంలో మహేష్ జనగణమన చిత్రం విషయంలో పూరీతో ఇలాగే చేసి, ఆ ప్రాజెక్ట్‌ని అటకెక్కించారు. ఇలా లైగర్ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రాన్ని స్టార్ మా చానల్లో టెలికాస్ట్ చేయగా ఓ మాదిరి మంచి రేటింగ్స్ నే సాధించింది. ఈ చిత్రం మొదటి టెలికాస్ట్ కి 6.7 టిఆర్పి రేటింగ్ వచ్చింది. ఇది చాలా సినిమాలు తో పోలిస్తే చాలా బెటర్ రేటింగ్ అంటున్నారు. బాహుబలి వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత కూడా ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రం మొదటి టెలికాస్ట్ కి కేవలం 5 టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే తెచ్చుకుంది. అంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసినా కూడా సరిగా రేటింగ్స్ రాలేదని దానికంటే లైగర్ సినిమా రేటింగ్స్ చాలా బెటరని విశ్లేషకులు అంటున్నారు. ఆ విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో విజయ్ దేవరకొండ కి ప్రభాస్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ చిత్రంలో నటిస్తున్నాడు. సమంత అనారోగ్య దృష్ట్యా కొంతకాలం షూటింగ్‌ని ఆపేశారు. సంక్రాంతి తర్వాత నుండి మళ్ళీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని చిత్రాలు వెండితెరపై ఫ్లాప్ అయిన బుల్లితెరపై ఎప్పుడు విడుదలైన అవి వీక్షకులను బాగా ఆకర్షిస్తుంటాయి. ఉదాహరణకు మహేష్ బాబు- త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు, ఖలేజా.... పవన్ కళ్యాణ్తో త్రివిక్రమ్ తీసిన జల్సాలను ఉదాహరణగా చెప్పవచ్చు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



