సంక్రాంతి బరిలో రజినీకాంత్ మూవీ!
on Oct 1, 2023
2024 సంక్రాంతి పోరు రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'ఈగల్', 'VD13'(విజయ్ దేవరకొండ-పరశురామ్ మూవీ), 'నా సామి రంగ', 'సైంధవ్' అంటూ ఏకంగా ఐదు తెలుగు సినిమాలు సంక్రాంతి సీజన్ పై కర్చీఫ్ వేశాయి. అయితే డబ్బింగ్ సినిమాలు సైతం అదే సీజన్ పై కన్నేయడం విశేషం. ఇప్పటికే శివకార్తికేయన్ 'అయలాన్' పొంగల్ రేసులో నిలవగా.. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్న 'లాల్ సలాం' కూడా రేసులోకి వచ్చింది.
'3' సినిమాతో దర్శకురాలిగా పరిచయమై ఆకట్టుకున్న సూపర్ స్టార్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ప్రస్తుతం 'లాల్ సలాం' అనే చిత్రం రూపొందుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో మొయిద్దీన్ భాయ్ అనే పవర్ ఫుల్ పాత్రలో రజినీకాంత్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను వదిలారు. కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
