'స్కంద' కలెక్షన్స్ డ్రాప్.. భారీ నష్టాలు తప్పేలా లేవు!
on Oct 1, 2023
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'స్కంద' మూవీ సెప్టెంబర్ 28 ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మాస్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంది. రామ్, బోయపాటి కాంబోలో వచ్చిన మొదటి సినిమా కావడం, మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉండటంతో.. అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.10.57 కోట్ల షేర్ రాబట్టింది. అయితే రెండో రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ నష్టాలు తప్పేలా లేవు.
ఓవరాల్ గా రూ.46.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన స్కంద.. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.10.57 కోట్ల షేర్ రాబట్టగా, రెండో రోజు(శుక్రవారం) రూ.4 కోట్ల షేర్, మూడో రోజు(శనివారం) రూ.3.81 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. వీకెండ్ కావడంతో రెండో రోజుతో పోలిస్తే మూడోరోజు ఎక్కువ కలెక్షన్స్ రావాల్సింది పోయి.. ఇంకా తగ్గాయి. రూ.47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన స్కంద మూడు రోజుల్లో రూ.18.38 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.28.62 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఈరోజు ఆదివారం, రేపు గాంధీ జయంతి కావడంతో ఈ రెండు రోజుల్లో మరో రూ.7-8 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశముంది. ఫుల్ రన్ లో ఈ మూవీ రూ.30 కోట్ల లోపు షేర్ కి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏరియాల వారిగా 'స్కంద' మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.6.32 కోట్ల షేర్
సీడెడ్: రూ.2.25 కోట్ల షేర్
ఆంధ్ర: రూ.6.82 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల మూడు రోజుల కలెక్షన్స్: రూ.15.39 కోట్ల షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ.1.55 లక్షల షేర్
ఓవర్సీస్: రూ.1.44 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల కలెక్షన్స్: రూ.18.38 కోట్ల షేర్

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
