"అదొక షిట్ షో".. బిగ్ బాస్‌పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్!
on Sep 27, 2020
ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కొన్ని ఆకర్షణీయమైన ఫొటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఇటీవల గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ లక్ష్మీ మీనన్. ఆమె అకౌంట్ వెరిఫైడ్ అవగా, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ స్టోరీలను పోస్ట్ చేస్తూ, తన ఫాలోయర్స్‌తో టచ్‌లో ఉంటూ వస్తోంది.
ఇటీవల బిగ్ బాస్ తమిళ్ నాలుగో సీజన్లో లక్ష్మీ మీనన్ కంటెస్టెంట్‌గా పాల్గొనబోతోందంటూ బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే, ఆ షోలో తాను పార్టిసిపేట్ చేయడం లేదని స్పష్టం చేస్తూ, ఆ షోపై ఓ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ, అన్ని రకాల ప్రచారానికీ ఆమె తెరదించింది.
లేటెస్ట్గా ఇన్‌స్టాగ్రమ్ స్టోరీలో, "నేను బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయట్లేదు. నేను ఇప్పుడు కానీ, ఇంకెప్పుడు కానీ ఇతరుల ప్లేట్లను కడగటం కానీ, టాయిలెట్లను క్లీన్ చేయడం కానీ జరగదు. షో పేరుతో కెమెరా ముందు ఇతరులతో ఫైట్ చేయను. ఏదో షిట్ షోకి నేను వెళ్తున్నానంటూ ఇప్పట్నుంచి ఇంకెవరూ వదంతులు పుట్టించరని ఆశిస్తున్నా" అని పోస్ట్ చేసింది లక్ష్మీ మీనన్.
ఆమె పోస్ట్‌పై కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేశారు. దీనిపై కూడా స్పందించింది లక్ష్మి. "నా స్టోరీ చూసి చాలా మంది నాకు కొన్ని నెగటివ్ మెసేజ్‌లు పంపారు. నన్ను ప్రశ్నించడానికి మీరెవరని అడుగుతున్నా. దేనిమీదైనా అభిప్రాయం, చాయిస్ కలిగుండటం నా హక్కు. కొంతమంది ఆ షోను ఇష్టపడొచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. రకరకాల కారణాల వల్ల ఆ షో అంటే నాకు ఇష్టం లేదు. నేను మా ఇంట్లో నా సొంత ప్లేట్లను కడుగుతాను, నా టాయిలెట్‌ను శుభ్రం చేసుకుంటాను. ఒక కెమెరా ముందు ఆ పని చేయాలని నేననుకోను." అని తేల్చి చెప్పింది. లక్ష్మీ మీనన్లో ఇలాంటి ఫైర్‌బ్రాండ్ వుమన్ ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.