అభిజీత్ మహానాయకుడు.. మోనాల్ సేఫ్!
on Sep 27, 2020
పాటగా మనమధ్యనే ఉంటాడు అంటూ గానగంధర్వుడు, స్వర మాంత్రికుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు నివాళి అర్పిస్తూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వీకెండ్ షోలో ఎంట్రీ ఇచ్చారు. ఉక్కుమనిషి టాస్క్ గెలిచిన కంటెస్టెంట్లకు ఆయన అవార్డులు ఇచ్చారు. మహానాయకుడిగా అభిజీత్‌ను, మహాకంత్రిగా అవినాష్‌ను ఎంపిక చేసిన సభ్యులు, మహానటి అవార్డుకు ఏకకంఠంతో గంగవ్వ పేరు సూచించారు. దాంతో మహానటి బిరుదును హౌస్ కెప్టెన్ గంగవ్వ అందుకున్నారు. బిగ్ హౌస్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌తో గంగవ్వకు అవార్డు ప్రదానం చేశారు.
ఈ రోజు నామినేషన్ జాబితాలో ఉన్న సభ్యుల్లో సేఫ్ అయ్యే కంటెస్టెంట్ పేరు లాస్యగా ప్రకటించారు. ఆ తర్వాత ఇంటి సభ్యుల మధ్య ఉన్న మనస్పర్దలు పోగొట్టేలా హౌస్ సభ్యుల్లోని ఒకరి నెటిగివ్ పాయింట్స్ చెప్పమంటూ మరో ఆట ఆడించాడు నాగార్జున. దాంతో మోనాల్ - అఖిల్ గురించి, నోయల్ - అమ్మ రాజశేఖర్, దివి - అభిజీత్, దేవి - గంగవ్వ, అవినాష్ - లాస్య, సుజాత - అభిజీత్, అమ్మ రాజశేఖర్ - దివి, లాస్య - స్వాతి దీక్షిత్లలో నెటిగివ్ అంశాలను చెప్పారు. మూడో వారంలో నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో దేవి, లాస్య, హారిక, మోనాల్, మెహబూబ్, ఆరియానా,కుమార్ సాయి ఉన్నారు. వీరిలో లాస్య, మోనాల్ సేఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు.
Also Read