ఆ ఇద్దరు హీరోలు మాత్రమే ఇష్టం అంటున్న హీరోయిన్
on Dec 14, 2023

రేపు విడుదల కాబోతున్న పిండం మూవీ ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయమవుతున్న కన్నడ హీరోయిన్ ఖుషి రవి. కానీ సినీ ప్రేమికులకి మాత్రం ఖుషి రవి పరిచయమే. ఆమె నటించిన కన్నడ హర్రర్ చిత్రం దైద ద్వారా అందరికి తెలుసు. ఆ సినిమాలో అద్భుతంగా నటించిన ఖుషి రవి తాజాగా తనకి ఒక తెలుగు హీరో అంటే చాలా ఇష్టమని చెప్పింది.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఖుషి రవి మాట్లాడుతు నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పింది అలాగే నాని అంటే కూడా తనకి ఇష్టమని ఇటీవలే ఆయన నటించిన హాయ్ నాన్న సినిమా చూశానని తనకి విపరీతంగా నచ్చిందని కూడా ఖుషి రవి చెప్పింది.ఇప్పుడు ఆమె పిండం మూవీలో తల్లి పాత్రలో నటిస్తుంది. ఈ విషయాన్ని ఉద్దేశించి యాంకర్ ఖుషి రవితో కెరీర్ ప్రారంభంలో తల్లి పాత్రలు చెయ్యడానికి రిస్క్ అనిపించలేదా అని అడిగితే లాక్ డౌన్ తరువాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మొత్తం పూర్తిగా మారిపోయింది.
ఒకప్పుడు వినోదం కోసం సినిమా చూసేవారు. కానీ ఇప్పుడు సినిమాలో కొత్తదనం ఉంటేనే చూస్తున్నారు అని కూడా ఆమె చెప్పుకొచ్చింది.ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనే ఉప శీర్షికతో వస్తున్నపిండం మూవీలో శ్రీరామ్ హీరోగా నటిస్తుండగా కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మిస్తున్నాడు. సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ పిండంలో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు లు ముఖ్య పాత్రలు పోషించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



