అప్పుడే ఓటీటీలోకి కుబేర!
on Jul 11, 2025
హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పుడదే బాటలో 'కుబేర' కూడా పయనిస్తోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. (Kuberaa on OTT)
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కుబేర'. జూన్ 20న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ క్రైమ్ డ్రామా.. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన కుబేర.. మంచి విజయాన్ని సాధించింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టనుంది.
'కుబేర' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని జూలై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఇటీవల పలు సినిమాలు ఓటీటీ కోసం హిందీ మార్కెట్ ను కూడా వదులుకుంటున్నాయి. నేషనల్ చైన్స్ లో హిందీ వెర్షన్ రిలీజ్ చేయాలంటే.. 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేసే కండిషన్ కి ఒప్పుకోవాలి. చాలా సినిమాలు హిందీ థియేట్రికల్ బిజినెస్ ని కాదనుకొని.. ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నాయి. అదే బాటలో 'కుబేర' కూడా పయనించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
