అనుష్కకు ఏమైంది.. అందుకే బయటకు రావట్లేదా..?
on Jul 11, 2025
హీరోలకు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ఒక దశాబ్ద కాలం పాటు తెలుగునాట తిరుగులేని స్టార్డంను చూసింది. అలాంటి అనుష్క.. కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించింది. బయట కూడా పెద్దగా కనిపించట్లేదు. దీంతో అసలు అనుష్కకు ఏమైంది? అనే చర్చ జరుగుతోంది. (Anushka Shetty)
'బాహుబలి-1' విడుదలై ఈ జూలై 10కి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ రీ-యూనియన్ అయింది. ఈ రీ-యూనియన్ కు రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇలా అందరూ హాజరయ్యారు. కానీ, అనుష్క మాత్రం మిస్ అయింది. బాహుబలి అనేది తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం. అంతటి గొప్ప చిత్రం పదేళ్ళ రీ-యూనియన్ కి అనుష్క రాకపోవడం అభిమానులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదొక్కటనే కాదు.. ఇతర ఈవెంట్లలోనూ అనుష్క పెద్దగా కనిపించట్లేదు. అయితే ఆమె బయటకు రాకపోవడానికి బలమైన కారణం ఉంది అంటున్నారు.
'బాహుబలి-1', 'బాహుబలి-2'కి మధ్యలో 'సైజ్ జీరో' అనే ఓ సినిమా చేసింది అనుష్క. ఎంతో ఫిట్ గా ఉండే అనుష్క.. ఆ సినిమా కోసం రిస్క్ చేసి మరీ, బాగా బరువు పెరిగింది. కానీ, అదే ఆమె కొంపముంచింది. అప్పటినుంచి అనుష్క సన్నబడటానికి ఎంత ట్రై చేసినా.. మునుపటి శరీరాకృతి రావట్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కొన్నేళ్లుగా అనుష్క చేస్తున్న సినిమాల్లో ఆమెను సన్నగా చూయించేందుకు సీజీ ఉపయోగిస్తున్నారని అంటుంటారు. అందుకే అనుష్క సినిమాలు చాలా తక్కువ చేస్తుందని, బయటకు కూడా పెద్దగా రావట్లేదని చెబుతున్నారు.
'సైజ్ జీరో' అనే ఒకే ఒక్క సినిమా అనుష్క కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించిందని అంటున్నారు. ఆ సినిమా చేయకపోయినా లేదా ఆ సినిమా కోసం అలా బరువు పెరగకుండా ఉన్నా.. అనుష్క కెరీర్ మరోలా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుష్క మునుపటిలా ఫిట్ గా ఉంటే.. బాహుబలి తర్వాత పాన్ ఇండియా వైడ్ గా ఎందరో స్టార్ హీరోల సినిమాలు, ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు బరువు తగ్గలేకపోవడం వల్ల.. పెద్దగా సినిమా చేయట్లేదు, బయటకు కూడా రావట్లేదని అనుష్క ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
