నాగ చైతన్య 'కస్టడీ'లో కృతి శెట్టి!
on Jan 18, 2023

నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'కస్టడీ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన చైతన్య ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. తాజాగా కృతి శెట్టి ఫస్ట్ లుక్ విడుదలైంది.
'బంగార్రాజు' తర్వాత చైతన్య, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో శివ పాత్రలో చైతన్య నటిస్తుండగా.. రేవతిగా కృతి కనిపించనుంది. తాజాగా విడుదలైన కృతి శెట్టి ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. గుండెలో ఉన్న బాధని కళ్ళలో చూపిస్తూ చెరసాలలో బందీ అయినట్లుగా ఉన్న ఆమె ఇంటెన్స్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.

చైతన్య గత చిత్రం 'థాంక్యూ' నిరాశపరిచింది. కృతి నటించిన గత మూడు చిత్రాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. మరి ఈ 'కస్టడీ' చిత్రంతో ఈ ఇద్దరు విజయాన్ని అందుకొని హిట్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



