బ్రేక్ ఈవెన్ కి చేరువైన 'వీరయ్య', 'వీరసింహా'!
on Jan 18, 2023

ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి, 'వీరసింహారెడ్డి' సినిమాతో నటసింహం బాలకృష్ణ బాక్సాఫీస్ బరిలోకి దిగారు. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఒకేసారి రెండు పెద్ద సినిమాలను నిర్మించి ఒక్కరోజు తేడాతో విడుదల చేస్తూ మైత్రి రిస్క్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ విడుదల తర్వాత ఈ రెండు చిత్రాలు కూడా భారీ వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ విన్నర్స్ అనిపించుకుంటున్నాయి.
జనవరి 12న విడుదలైన 'వీరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.31 కోట్లకు పైగా షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. వరల్డ్ వైడ్ గా రూ.73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఆరు రోజుల్లో రూ.65 కోట్ల షేర్ రాబట్టిందని అంచనా. అంటే 'వీరసింహారెడ్డి' హిట్ అనిపించుకోవాలంటే ఇంకా కనీసం రూ.8 కోట్ల పైగా షేర్ రాబట్టాల్సింది ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఈ వీకెండ్ లోపులో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనిపిస్తోంది.
ఇక జనవరి 12న విడుదలైన 'వాల్తేరు వీరయ్య' రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.83 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా కేవలం ఐదు కోట్ల దూరంలోనే ఉంది. ప్రస్తుతం వీరయ్య దూకుడు చూస్తుంటే రేపటితో బ్రేక్ ఈవెన్ సాధించినా ఆశ్చర్యంలేదు. మొత్తానికి మైత్రి నిర్మించిన రెండు సినిమాలు కూడా త్వరలోనే లాభాల్లోకి ఎంటరయ్యే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



