గ్రాండ్ గా 'గాడ్ ఫాదర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ ఎవరు?
on Sep 25, 2022

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా ముహూర్తం ఖరారైంది.
'గాడ్ ఫాదర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 28న సాయంత్రం అనంతపూర్ లోని గౌట్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరగనుంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మెగా హీరోలు పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నిరవ్ షా, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



