నేను బ్రతికే ఉన్నాను.. కోట ఎమోషనల్ కామెంట్స్!
on Mar 21, 2023

ఈమధ్య సోషల్ మీడియాలో కొందరు మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బ్రతికున్న వాళ్ళని కూడా చంపేస్తున్నారు. వ్యూస్, డబ్బుల కోసం.. ఆ నటుడు చనిపోయాడు, ఈ నటి చనిపోయింది అంటూ థంబ్ నెయిల్స్ పెట్టి యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అవి చూసి అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు విషయంలో కూడా ఇదే జరిగింది.
అనారోగ్యంతో కోట కన్నుమూశారు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేశారు. అది నిజమని నమ్మి ఎందరో కంగారు పడ్డారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక పోలీసులైతే ఆ వార్త నిజమని నమ్మి.. ప్రముఖులు వస్తారన్న ఉద్దేశంతో కోట ఇంటికి సెక్యూరిటీ ఇవ్వటానికి కూడా వెళ్లారు. వరుస ఫోన్లు, పోలీసుల రాకతో షాకైన కోట.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలుపుతూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని, అసలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారికి పోలీసులు, ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోట కోరారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



