ముగిసిన 'సిరివెన్నెల' అంత్యక్రియలు
on Dec 1, 2021

లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు యోగేశ్వరశర్మ నిప్పంటించారు.
మంగళవారం సాయంత్రం సిరివెన్నెల కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం సిరివెన్నెల భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలింఛాంబర్ కు తీసుకొచ్చారు. అక్కడకి భారీగా తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు సిరివెన్నెల పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం అభిమానుల కన్నీటి వీడ్కోలుతో సిరివెన్నెల అంతిమయాత్ర మహాప్రస్థానానికి చేరుకుంది. అక్కడ అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు.
'సిరివెన్నెల' సినీ ప్రయాణం.. 11సార్లు నంది అవార్డు.. వరుసగా మూడు సార్లు!
అమ్మ మందలించిందని తుంటరిపని చేసి చిన్నప్పుడే ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



