రాంప్రసాద్ కంత్రి అన్న రాంగోపాల్ వర్మ
on Jun 21, 2022

జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ గురుంచి కానీ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్స్ తో ట్రెండ్ అయ్యే రామ్ గోపాల్ వర్మ గురుంచి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐతే వరంగల్ లో ఇటీవల జరిగిన కొండా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాంప్రసాద్ గురుంచి ఆర్జీవీ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాంప్రసాద్ ఒక కమెడియన్ అని తనకు అసలు విషయం తెలియదట. ఫోటో చూస్తే మాత్రం చాలా కంత్రీలా ఉంటాడని చెప్పారు. రాంప్రసాద్ తన లోపలున్న క్రూరమైన మెంటాలిటీనీ దాచి పెట్టి ఎవరికీ కనిపించకుండా అందరినీ నవ్విస్తూ ఉంటాడు అని నా అనుమానం అని చెప్పారు ఆర్జీవీ. రాంప్రసాద్ కూడా మీరు చెప్పింది నిజమే. మనుషుల్ని చూస్తే చాలు మీరు చాలా బాగా స్టడీ చేసేస్తారు.
ఏ విషయమైనా మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు నేను కూడా అలాగే ఉంటాను అన్నాడు. నేను చాలా సరదాగా, జెన్యూన్ గా ఉంటాను. కోపమొస్తే మాత్రం నాలో విల్లన్ బయటికి వస్తాడు. సర్ ఈ నా ఫేస్ ని చూసి ఈ రోల్ కి నేను సరిపోతానని గెస్ చేసి మరీ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు రాంప్రసాద్. రాంగోపాల్ వర్మ విజయవాడ రౌడీయిజమ్ నేపథ్యంలో తీసిన మూవీ శివ ఒక సెన్సేషన్ సృష్టించింది. తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రక్త చరిత్ర, ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సత్య, సర్కార్, కంపెనీ ఇలాంటి ఎన్నో అద్భుతమైన ల్యాండ్ మార్క్ చిత్రాలను తీసి ఒక చరిత్ర సృష్టించారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ నేపథ్యంలో కొండా మూవీ తీశారు రామ్ గోపాల్ వర్మ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



