మాస్ రాజాను ఢీ కొడుతున్న కిరణ్ అబ్బవరం!
on Mar 2, 2023

ఇటీవల 'వినరో భాగ్యము విష్ణు కథ'తో ప్రేక్షకులను పలకరించిన యువ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'మీటర్'. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్ కాడూరి దర్శకుడు. ఈ సినిమాని ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అయితే అదే రోజున మాస్ మహారాజా రవితేజ సినిమా విడుదల కానుండటం విశేషం.
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'రావణాసుర'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోగా నటించిన 'ధమాకా'తో, కీలక పాత్ర పోషించిన 'వాల్తేరు వీరయ్య'తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో 'రావణాసుర'పై మంచి అంచనాలు ఉన్నాయి. అలాంటిది రవితేజ సినిమా విడుదలవుతున్న రోజే కిరణ్ అబ్బవరం తన సినిమాని విడుదల చేయడానికి సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.
'సెబాస్టియన్ పి.సి.524', 'సమ్మతమే', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' వంటి వరుస పరాజయాల తర్వాత 'వినరో భాగ్యము విష్ణు కథ' కిరణ్ కి కాస్త ఊరటనిచ్చింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ స్టేటస్ దక్కించుకుంది. మరి ఇప్పుడు మాస్ రాజాతో పోటీకి దిగుతున్న కిరణ్ 'మీటర్' సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



