'జై భీమ్' దర్శకుడితో సూపర్ స్టార్ మూవీ
on Mar 2, 2023

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన 169వ సినిమా 'జైలర్' చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన 170వ సినిమా ప్రకటన వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకుడు కావడం విశేషం.
లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ శుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా రజినీకాంత్ 170వ సినిమాని అధికారికంగా ప్రకటించారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 'పొన్నియిన్ సెల్వన్-2', 'ఇండియన్-2' వంటి పలు భారీ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ఇప్పుడు రజినీతో మరో భారీ చిత్రాన్ని ప్రకటించింది. గతంలో సూపర్ స్టార్ తో 'రోబో 2.O', 'దర్బార్' వంటి చిత్రాలను నిర్మించింది. అలాగే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా నిర్మిస్తున్న 'లాల్ సలాం' చిత్రంలో రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు మరోసారి లైకాతో చేతులు కలిపారు రజినీ.

ఇక 'జై భీమ్' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు జ్ఞానవేల్ ఈసారి సూపర్ స్టార్ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



