ఆ ఘనత సాధించిన ఏకైక తెలుగు మూవీ కింగ్‌డమ్!
on Aug 3, 2025

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'కింగ్‌డమ్' బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. కేరళ కలెక్షన్స్ మాత్రం అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. (Kingdom)
నిజానికి 'కింగ్‌డమ్' సినిమా మలయాళ వెర్షన్ విడుదల కాలేదు. అయినప్పటికీ ఈ సినిమా కేరళలో 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో నాన్ మలయాళ వెర్షన్ లో కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఏకైక తెలుగు చిత్రంగా 'కింగ్‌డమ్' రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే జోరు కొనసాగితే కేరళలో 'కింగ్‌డమ్' మరిన్ని సంచలనాలు సృష్టించేలా ఉంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ జూలై 31న థియేటర్లలో అడుగుపెట్టింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



