పోక్సో కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్.. ఇంతమందిని మోసం చేశాడా!
on Aug 3, 2025

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణ మాస్టర్ పై గత నెలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు అయింది. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. దీంతో కృష్ణ మాస్టర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు కావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. బెంగుళూరులోని తన అన్న నివాసంలో కృష్ణ మాస్టర్ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు.. తాజాగా అతనిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ పోక్సో కేసుతో పాటు కృష్ణ మాస్టర్ పలు వివాదాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మహిళను వివాహం చేసుకొని, ఆమెకి సంబంధించిన రూ.9.50 లక్షలు నగదు తీసుకుని పరారయ్యాడని సమాచారం. ఇన్స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతులను, మహిళలను మోసం చేసినట్లు కూడా అతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



