కీర్తి సురేష్ బ్యాగ్ లో రివాల్వర్.. రాజేష్ దండ ద్వారా వెలుగులోకి
on Nov 6, 2024

2016 లో రామ్ పోతినేని(ram potineni)హీరోగా వచ్చిన నేను శైలజ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ కీర్తి సురేష్(keerthy suresh)ఆ తర్వాత నేనులోకల్, అజ్ణాత వాసి, మహానటి, సర్కారు వారి పాట,దసరా వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పొందటంతో పాటు మహానటి లో అత్యుత్తమ నటన కనపర్చినందుకు నేషనల్ అవార్డుని కూడా పొందింది.
రీసెంట్ గా తనే ప్రధాన పాత్రలో 'రివాల్వర్ రీటా'(revolver reeta)అనే తమిళ సినిమా చేస్తుంది.ఇప్పుడు ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కాబోతుంది.హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండ ఈ మూవీని విడుదల చెయ్యబోతున్నాడు.ఆర్ కె చంద్రు దర్శకత్వంలో సుదన్ సుందరం,జగదీష్ పళని స్వామి నిర్మిస్తుండగా రాధికా, రెడీన్ కింగ్ స్లే ముఖ్య పాత్రలో చేస్తున్నారు.

కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని రోజుల క్రితం టీజర్ రిలీజ్ అయ్యింది. కొంతమంది దొంగలు డబ్బు కోసం కీర్తి సురేష్ హ్యాండ్ బాగ్ ని దొంగతనం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు బాగ్ ఓపెన్ చేస్తే అందులో రివాల్వర్, రక్తం మరకలతో ఉన్న కత్తి, బాంబు ఉంటాయి. అప్పుడు వాళ్ళు కీర్తి తో నువ్వు ఎవరు అని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



