యూ ట్యూబ్‌లో కాటమరాయుడి కలకలం
on Feb 5, 2017

సంక్రాంతికి విడుదలైన ఖైదీ నెం.150 రికార్డుల గురించి ఇంకా మాట్లాడుకొంటూనే ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ వంతు వచ్చింది. కాటమరాయుడు టీజర్‌తో పాత రికార్డుల తుప్పు వదిలిస్తున్నాడు పవర్ స్టార్. శనివారం సాయింత్రం కాటమరాయుడు టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ ఇలా వచ్చిందో లేదో.. సోషల్ మీడియా అంతటా స్పైడ్ అయిపోయింది. అతి తక్కువ సమయంలో మిలియన్ వ్యూస్ కొట్టిన టాలీవుడ్ టీజర్‌గా కాటమరాయుడు చరిత్ర సృష్టించింది. సౌత్ ఇండియాలోనే ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. కాటమరాయుడు టీజర్ వచ్చి 24 గంటలు గడవక ముందే... పాతిక లక్షల వ్యూస్ సొంతం చేసుకొని యూ ట్యూబ్‌ని షేక్ చేసేసింది.
టీజర్‌లో కొత్తదనం ఏమీ లేకపోయినా, పవన్ లుక్స్, పవన్ వదిలిన డైలాగ్... ఈ టీజర్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. పైగా పవర్ స్టార్ ఫీవర్ మహా జోరుగా ఉన్న రోజులివి. అందుకే ఈ టీజర్‌కు పవన్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. టీజర్‌తోనే ఇలా షేక్ చేసేస్తే.. ఇక సినిమా సంగతేంటో అంటూ అభిమానులు అప్పుడే అంచనాలు వేసేసుకొంటున్నారు. యూట్యూబ్‌లో రికార్డుల రారాజుగా నిలుస్తున్న కాటమరాయుడు.. బాక్సాఫీసు దగ్గర ఎంత కలకలం సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



