బాలయ్యని ఫాలో అవుతున్న పవన్
on Feb 5, 2017

పల్నాటి బ్రహ్మానాయుడు సినిమా గుర్తుంది కదా?? బాలకృష్ణ అభిమానులే కాదు, తెలుగు సినీ ప్రేమికులంతా ఆ సినిమాని, అందులో బాలయ్య హీరోయిజాన్నీ గుర్తుపెట్టుకొంటారు. అదేం సూపర్ హిట్ సినిమా కాదు, అట్టర్ ఫ్లాప్ అయిన బాలయ్య సినిమాల్లో అదొకటి. అందులో బాలయ్య తొడ గొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ ఉంది. దాన్ని న భూతో న భవిష్యత్త్ అంటూ సెటైర్లు వేసుకొంటారు నాన్ బాలయ్య ఫ్యాన్స్. సరిగ్గా అలాంటి అద్భుతమే చేశాడు కాటమరాయుడులో పవన్ కల్యాణ్. ఈ టీజర్ ఇప్పుడు నెట్ ప్రపంచంలో సందడి చేస్తోంది.
పవన్ అభిమానులు ఆహా.. ఓహో అంటున్నారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఓ చోట ట్రైన్ తలుపుల్ని విరగ్గొట్టుకొంటూ ఫ్లాట్ ఫామ్‌పై పడతాడు. ట్రైన్ డోర్ ఏంటి? తాటాకులా గాలిలో ఎగిరి కింద పడడం ఏంటి? అది చెక్కతో చేసిన తలుపు అనుకొన్నారేమో మన సినీ మేధావులు. బాలయ్య వింతతో పోలిస్తే ఇది చిన్నదే కావొచ్చు. కానీ... మరీ అంత ఓవర్ ఎందుకు అనిపిస్తుంది.
ఓ హీరో కొడితే వంద మంది ఎగిరిపోవడం ఇప్పటి జనాలకు నచ్చడం లేదు. ఇలాంటి ఓవరాక్షన్‌ని ఎందుకు అంగీకరిస్తారు? పవన్ నటన సహజంగా ఉంటుంది. అతని ఫైట్లు కూడా అంతే. అయితే కాటమరాయుడులో ఈ షాట్ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కాటమరాయుడు సినిమాలో ఇంకెన్ని అద్భుతాలు ఉన్నాయో?? మన హీరోలు, ఆ హీరోల్ని మోసేయాలనుకొనే దర్శకుల ఆలోచన మారనంత వరకూ ఇలాంటి విన్యాసాలు చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



