
ట్యాలెంటెడ్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ ఒకరు. 'ఆర్ఎక్స్ 100'లో ఆయన నటనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. హీరోగా మాత్రమే కాదు.. విలన్ గానూ ప్రేక్షకుల మదిలో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తనలో స్టైలిష్ విలన్ ఉన్నాడని 'నానీస్ గ్యాంగ్ లీడర్'తో చూపించారు. కోలీవుడ్ స్టార్ అజిత్ 'వలిమై'లో తనదైన విలనిజంతో తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. అయితే ఆయన నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటుతోంది. ఇప్పుడు కార్తికేయ గుమ్మకొండ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు.
హీరోగా రెండేళ్ళ విరామం తర్వాత కార్తికేయ గుమ్మకొండ చేస్తున్న సినిమా 'కమ్‌బ్యాక్'. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. 'కమ్‌బ్యాక్'తో కార్తికేయ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు(సెప్టెంబర్ 21న) అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మాత.
'బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్ళు అవుతోంది. నేనింకా ప్రొఫెషన్ మారిపోయి ఉంటాడేమో అనుకున్నాను. మూడేళ్ళు అవుతుందని నీకు గుర్తు అన్నా ఉంది. అది నాకు కూడా లేదు. అయినా ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? యా... దట్స్ ట్రూ (అది నిజమే). ఇట్ ఫీల్స్ లైక్ సూసైడ్ మిషన్ (ఓ విధంగా అది ఆత్మహత్య చేసుకోవడమే). మూడేళ్ళ నుంచి ఏమైపోయాడో తెలియలేదు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు?' అని వాయిస్ ఓవర్ వినిపిస్తున్న సమయంలో తెరపై టెక్నీషియన్ల పేర్లు పరిచయం చేశారు. ఆ తర్వాత స్కిప్పింగ్, బాక్సింగ్ చేస్తున్న హీరోని చూపించారు. కార్తికేయ ఎప్పటిలా ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించారు. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం చాలా బావుంది. ఆ తర్వాత 'కమ్‌బ్యాక్' టైటిల్ ప్రకటించారు. ఇందులో హీరో బాక్సర్ రోల్ చేస్తున్నారని గ్లింప్స్ ద్వారా చెప్పారు.
ఇది కూడా చదవండి: విడాకులు.. సంచలనంగా మారిన కాజల్ అగర్వాల్ కామెంట్స్.!
.webp)
మీకు నచ్చవచ్చు:
ఏ పువ్వు ఏ తేటిదన్నది.. 'ఆకాశం ఏనాటిదో' పాటలో ఆ లైన్లకు అర్థం తెలుసా.?
కొమ్మ కొమ్మకో సన్నాయి.. 47 ఏళ్ళ క్రితం వేటూరి ఎంత గొప్ప పాట రాశారు.!
[Kartikeya Gummakonda Turns Director, Kartikeya Comeback Movie, Kartikeya Gummakonda, Comeback Movie, Hero Kartikeya, Director Kartikeya, Telugu Film News, Telugu News]




.webp)

