Home

»

Latest News

ఇరుముడి పార్ట్ 2 : క్లారిటీ వచ్చేసింది.. డీటెయిల్స్ ఇవే 

Sep 21, 2026 7:23PM

 

తెలుగు సినిమాతో పాటు తెలుగు ప్రేక్షకులు 'మా దగ్గర 'ఇరుముడి' సినిమా ఉందనే గర్వంతో ఉన్నారు. కలెక్షన్స్ కూడా ఆ గర్వాన్ని శూచాతప్పకుండా ఆచరిస్తూ రీసెంట్ గా  250 కోట్ల గ్రాస్ అందుకొని టాక్ ది డే ని కంటిన్యూ చేస్తుంది. 

అయితే ఈ అఖండ విజయం తర్వాత సినీ ప్రియుల్లో, మాస్ మహారాజా అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. అదేమిటంటే.. ‘ఇరుముడి’కి సీక్వెల్  ఉంటుందా? కథను ముగించిన తీరు, పాత్రల ఎమోషన్ చూసిన వారు పార్ట్ 2 వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ‘ఇరుముడి 2’ గురించి అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లేదా మరో స్టార్ హీరోతో దర్శకుడు శివ నిర్వాణ పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారంటూ ప్రచారం ముమ్మరంగా సాగింది.

 

ఈ వార్తలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ సీక్వెల్‌పై తన ఆలోచనను స్పష్టం చేశారు. ‘ఇరుముడి’ కథ అనేది ఒక తండ్రి, కూతురు, అలాగే అయ్యప్ప స్వామిపై ఉన్న నిశ్చలమైన భక్తి చుట్టూ తిరిగే ఒక పరిపూర్ణమైన ఎమోషనల్ జర్నీ. ఈ కథకు సహజ సిద్ధమైన ముగింపు లభించిందని, కేవలం విజయం సాధించినంత మాత్రాన బలవంతంగా సీక్వెల్స్ చేయడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆయన వెల్లడించారు. ఒక కథకి ఆత్మ ఉంటేనే అది ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, ‘ఇరుముడి’ ఆత్మ ఆ సినిమా ముగింపుతోనే పూర్తయిందని తెలిపారు.కాబట్టి ప్రస్తుతానికి ‘ఇరుముడి పార్ట్ 2’ ప్రతిపాదన ఏదీ లేదని సమాచారం. 


మొత్తం చదవండి: కమెడియన్ తో 12 th ఫెయిల్ హీరోయిన్ మేధా శంకర్ పెళ్లి: డేట్ ఇదే!

 


సీక్వెల్ ఊహాగానాలకు ముగింపు పలికిన శివ నిర్వాణ, తన తదుపరి ప్రాజెక్ట్‌ల కోసం కొత్త కథలపై దృష్టి సారిస్తున్నాడు. ఇరుముడి ప్రస్తుతం ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రికార్డ్స్ సృష్టించే పనిలో బిజీ.

 

మీకు నచ్చవచ్చు

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి: 'ఇరుముడి' సినిమాలోని ఈ పాట అర్థం తెలుసా.?

నాగార్జున మాస్ లుక్‌కు తోడైన మీనా గ్లామర్.. ఈ పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్!

 

 

[Irumudi Part 2 , Irumudi Movie Sequel, Ravi Teja, Shiva Nirvana, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com