.webp)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రాకా' విడుదలకు ముందే హిస్టరీ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ సాధించని ఒక అసాధ్యమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది.
సాధారణంగా ఒక సినిమా సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం... ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ 'రాకా' విషయంలో మాత్రం అది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు అట్లీ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా సాంకేతిక పరంగా ఒక సరికొత్త రికార్డును సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
రియల్-టైమ్‌లో అత్యధిక సంఖ్యలో పెర్‌ఫార్మర్స్‌ను మోషన్ క్యాప్చర్ చేయడం ద్వారా 'రాకా' చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఏకంగా 37 మంది పెర్‌ఫార్మర్లను ఒకేసారి సింగిల్ షాట్‌లో, రియల్-టైమ్‌లో మోషన్ కామ్‌తో క్యాప్చర్ చేసి ఈ ప్రపంచ రికార్డ్‌ను సాధించారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, టెక్నాలజీని వాడుతున్నారని ప్రచారం జరిగినప్పటికీ, ఇలాంటి ప్రయోగం ఇండియన్ సినిమాలో జరగడం ఇదే తొలిసారి.
.webp)
ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు స్వయంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీలకు వేదికపై ఈ అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను అందజేశారు. సన్ పిక్చర్స్ తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ మైలురాయిని "HISTORY MADE 🏆 A global triumph that takes Indian cinema to the world stage!" అని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ఊగిపోయింది.
ఇది కూడా చదవండి: మెగా కాంబో.. బుచ్చిబాబుతో చిరంజీవి సినిమా.. అసలు ట్విస్ట్ ఇదే.!
ఈ గ్రాండ్ అచీవ్‌మెంట్‌తో 'రాకా' సినిమాపై ఉన్న అంచనాలు వేరే లెవెల్‌కి వెళ్ళిపోయాయి. అవతార్ వంటి సినిమాల్లో చూసిన హై-ఎండ్ టెక్నాలజీని ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద అల్లు అర్జున్ నటించిన సినిమాలో చూడబోతున్నాం. విడుదల కాకముందే వరల్డ్ రికార్డ్‌తో గ్లోబల్ ట్రెండ్ అవుతున్న ఈ సినిమా, థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి.. రాజశేఖర్ వింటేజ్ సాంగ్.. 33 ఏళ్ళయినా అదే మ్యాజిక్.!
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా.. 28 ఏళ్ళయినా ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించే లవ్ సాంగ్.!
[Raaka Movie Guinness World Record, Raaka Motion Capture Record, Raaka Guinness Record, Allu Arjun Raaka Record, Icon Star Allu Arjun, Director Atlee, Telugu Film News, Telugu News]






