జపాన్‌లో కార్తి రోల్ ఏంటి?
on Jun 27, 2023

జపాన్ సినిమాలో నటిస్తున్నారు హీరో కార్తి. ఈ సినిమాలో ఆయన రోల్ గురించి ఇంట్రస్టింగ్ డిస్కషన్లు జరుగుతున్నాయి. జపాన్‌లో కార్తి ఒక రోల్‌లో కాదు, డబుల్ యాక్షన్‌లో కనిపిస్తారని అంటున్నారు మేకర్స్. కార్తి తన కెరీర్‌లో నటిస్తున్న 25వ సినిమా ఇది. ఆల్రెడీ పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టులు, సర్దార్ సినిమా హిట్ కావడంతో ఆనందంగా ఉన్నారు కార్తి. ఇప్పుడు అదే సంతోషంతో జపాన్ సినిమాను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ స్టేజెస్‌లో ఉంది జపాన్ మూవీ. మరి కొన్ని వారాల్లోనే షూటింగ్ పూర్తికానుంది.
అందుకే , డైరక్షన్ డిపార్ట్ మెంట్‌లో కొందరిని ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు షిఫ్ట్ చేశారు. కార్తి పుట్టినరోజున టీజర్ విడుదల చేశారు మేకర్స్. గ్యాంగ్‌స్టర్ మూవీగా తెరకెక్కుతోంది జపాన్. అను ఇమ్మాన్యుయేల్, విజయ్ మిల్టన్, సునీల్ కీ రోల్స్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కార్తి డబుల్‌యాక్షన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత కార్తి నలన్ కుమారస్వామి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీకి ప్రిపేర్ అవుతూనే జపాన్ ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. దీపావళికి విడుదల కానుంది జపాన్ మూవీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



