ఈ నగరానికి ఏమైంది?.. రీరిలీజ్ బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్!
on Jun 27, 2023

ఈ జనరేషన్ యూత్ మెప్పు పొందిన సినిమాలలో 'ఈ నగరానికి ఏమైంది?' ఒకటి. 'పెళ్ళి చూపులు' తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర 'పెళ్ళి చూపులు' స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ, 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాకి ఎందరో అభిమానులున్నారు. స్మాల్ స్క్రీన్ మీద ఈ సినిమాని రిపీటెడ్ గా చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ గాను ఈ సినిమాలో సీన్స్ ని, డైలాగ్స్ ని ఉపయోగిస్తుంటారు. అంతలా ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయింది. కాగా ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ లోనూ మ్యాజిక్ చేసేలా ఉంది.
'ఈ నగరానికి ఏమైంది?' సినిమా 2018 జూన్ 29న విడుదలైంది. ఈ జూన్ 29 తో ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా జూన్ 29న ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బుకింగ్స్ స్టార్ హీరో సినిమా రీరిలీజ్ స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్ లో 15 కి పైగా షోలు ఓపెన్ చేయగా, ఇప్పటికే మెజారిటీ షోలు బుక్ అయ్యాయి. ఈ రెస్పాన్స్ చూస్తుంటే మరికొన్ని షోలు పెరిగేలా ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా స్టార్ హీరోల సినిమా స్థాయిలో రీరిలీజ్ లో మ్యాజిక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



