వీక్ డేస్ లోనూ 'కాంతార' జోరు.. తెలుగులో వసూళ్ళ ప్రభంజనం!
on Oct 18, 2022

కన్నడ సినిమా 'కాంతార' తెలుగు రాష్ట్రాల్లో దూకుడు చూపిస్తూనే ఉంది. మూడో రోజు సోమవారం అయినప్పటికీ మొదటి రోజు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. దీపావళి వరకు ఇదే జోరు కొనసాగితే ఈ చిత్రం తెలుగులో అంచనాలకు మించిన సంచలనాలు సృష్టించడం ఖాయం.
తెలుగులో 'కాంతార' బిజినెస్ వాల్యూ రూ.2 కోట్లని అంచనా. అయితే ఈ చిత్రం మొదటి రోజే రూ.2.1 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక రెండో రోజు రూ.2.80 కోట్ల షేర్ తో సత్తా చాటింది. వీక్ డేస్ లోనూ ఈ చిత్రం అదే జోరు చూపిస్తుంది. మూడో రోజు రూ.1.90 కోట్లు వసూలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.6.80 కోట్ల షేర్(13.50 కోట్ల గ్రాస్) రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఫుల్ రన్ లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్ల షేర్ రాబట్టినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.
హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన 'కాంతార' చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రిషబ్ తో పాటు సప్తమి, కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించారు. తెలుగులో 'కాంతార'ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



