కన్నప్ప మొదటి రోజు కలెక్షన్స్ ఇవే.. రికార్డులు చెల్లాచెదురు
on Jun 28, 2025
మంచు విష్ణు(Manchu Vishnu)నటించిన మైథలాజికల్ మూవీ 'కన్నప్ప'(Kannappa). నిన్న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'కన్నప్ప' ఉదయం 7 గంటల ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. విష్ణు కెరీర్ లోనే ఒక మరుపురాని మూవీగా నిలిచిపోవడం ఖాయమనే మాటలు కూడా వినపడుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో విష్ణు నటన ఎంతో అద్భుతంగా ఉందనే అభిప్రాయాన్ని సినీ విమర్శకులు సైతం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఇరవై కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి . మంచు విష్ణు కెరీర్ లోనే ఇది హయ్యస్ట్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. మూవీకి పాజిటివ్ టాక్ ఉన్న దృష్ట్యా రాబోయే రోజుల్లో భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోను మార్నింగ్ షో కి ఒక మాదిరిగా బుకింగ్స్ స్టార్ట్ అయ్యి, ఫస్ట్ షో, సెకండ్ షోస్ కి హయ్యస్ట్ బుకింగ్స్ ని కన్నప్ప సాధించింది.
'రుద్ర' అనే క్యారక్టర్ లో చేసిన ప్రభాస్(Prabhas)తో పాటు, శివుడుగా చేసిన అక్షయ్ కుమార్(Akshay Kaumar)కన్నప్ప తండ్రి శరత్ కుమార్(Sarath Kumar)కిరాత గా చేసిన మోహన్ లాల్(Mohanlal)కన్నప్ప భార్య ప్రీతీ ముకుందన్' ఇలా అందరు తమ పాత్ర పరిధి మేరకు నటించి సినిమా విజయంలో భాగస్వామ్యమయ్యారు. మహాభారతం ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్(MukeshkuMar singh) దర్శకత్వంలో అవా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై మోహన్ బాబు, విష్ణు సుమారు 200 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
