విజ్జు నువ్వు గర్వపడేలా చేస్తాను.. అనుకున్నదే అయ్యింది రష్మిక
on Jun 28, 2025
స్టార్ హీరోయిన్ రష్మిక 'మైసా' అనే కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.సదరు పోస్టర్ లో రష్మిక చాలా ఆవేశంతో ఉండటంతో పాటు కత్తిని పట్టుకొని ఉంది. ఫేస్ నిండా రక్తపు మరకలు ఉన్నాయి. ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో అందరిలో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రం ద్వారా రవీంద్ర అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. అన్ ఫార్ములా ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తుంది.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఇనిస్టాగ్రమ్ లో 'మైసా' పోస్టర్ ని షేర్ చేస్తు 'ఇది అద్భుతంగా ఉండనుంది' అనే క్యాప్షన్ ని చేసాడు. ఈ క్యాప్షన్ కి రష్మిక రిప్లై ఇస్తు 'విజ్జు ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను' అంటూ హార్ట్ ఎమోజి ని జోడించింది. విజయ్, రష్మిక రిలేషన్ లో ఉన్నారనే వార్తలు చాలా కాలం నుంచి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ ని సోషల్ మీడియా వేదికగా విజ్జు అని రష్మిక పిలవడంతో మరోసారి ఈ జంట హాట్ టాపిక్ గా మారింది.
ఇక విజయ్,రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించారు. రష్మిక రీసెంట్ గా కుబేర తో తన ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది. విజయ్ ప్రస్తుతం 'కింగ్ డమ్' అనే మూవీతో బిజీ గా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
