షూటింగ్ లో గాయపడిన సూపర్ స్టార్..!
on May 11, 2016

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గాయపడ్డాడు. షూటింగ్ లో భాగంగా కబడ్డీ సీన్స్ ను షూట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విషయంలోకి వెళ్తే, తెలుగు, తమిళంలో రిలీజై సూపర్ హిట్టయిన లారెన్స్ కాంచన సినిమా కన్నడలో కల్పనగా తెరకెక్కి సూపర్ హిట్టయ్యింది. దాంతో కాంచన 2 ను కూడా కల్పన 2 పేరుతో కన్నడంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాలో వచ్చే కబడ్డీ సన్నివేశాల కోసం, మల్లేశ్వరం ప్రాంతంలో ఉపేంద్రతో షూటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఉపేంద్ర గాయపడ్డారు. షూటింగ్ కాసేపు ఆపేసి పెయిన్ కిల్లర్స్ వేసుకుని మళ్లీ కంటిన్యూ చేశారు ఉపేంద్ర. సినిమా ఆగిపోకూడదని మాత్రలు వేసుకుని మరీ తన షాట్స్ కంప్లీట్ చేసిన ఉపేంద్ర డిడికేషన్ ను కన్నడ సినీవర్గాలు అభినందిస్తున్నాయి. జనవరిలో ఉపేంద్ర కాలికి గాయం అయింది. కబడ్డీ ఆడుతున్న సమయంలో అదే గాయం తిరగబెట్టిందని డాక్టర్లు చెబుతున్నారు. సినిమా ఉపేంద్ర సరసన ప్రియమణి, అవంతికా శెట్టి నటిస్తున్నారు. సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



